TEJA NEWS

దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ..
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ భరత్ , టీడీపీ ఇన్చార్జి సుధాకర్ , బిజెపి నేతలు.
కేజీహెచ్,టర్నల్ చౌట్రి, ఫ్రూట్ మార్కెట్ ప్రాంతాల్లో ప్రారంభం.


గాజువాక దక్షిణ నియోజకవర్గం లో కేజీహెచ్, టర్నల్ చౌట్రి, ఫ్రూట్ మార్కెట్ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ లను విశాఖ ఎంపీ భరత్ , స్థానిక ఎమ్మెల్యే శ్రీవ వంశీకృష్ణ శ్రీనివాస్ , టీడీపీ సౌత్ ఇన్చార్జి సుధాకర్ అన్న క్యాంటీన్ లను ప్రారంభించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కూటమి నేతలతో కలసి పలువురికి స్వయంగా వడ్డించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలకు రుచికరమైన , నాణ్యమైన ఆహారం 5 రూపాయలకు అందించిన గొప్ప విషయం అని అన్నారు. పేదలకు అవసరమైన ప్రదేశాలలో ఏర్పాటు చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి హామీ నెరవేర్చడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కూటమి శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు….


TEJA NEWS