TEJA NEWS

గర్భిణీ స్త్రీలు,బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
టేకుమట్ల అంగన్వాడి 3 కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం.

సూర్యాపేట జిల్లా : సూర్యాపేట మండలం టేకుమట్ల 3వ అంగన్వాడి కేంద్రం లో అంగన్వాడి టీచర్ కూరం వసంత ఆధ్వర్యంలో పోషణ వారోత్సవాలను పురస్కరించుకొని పోషకాహార విలువలపై గర్భిణీమహిళాలకు, బాలింతలకు చిన్నారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే విషయమై అంగన్వాడి టీచర్ వసంత మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు,బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని పౌష్టికాహారంతోనే తల్లి, బిడ్డ క్షేమంగా ఉంటారని, గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టిక ఆహారం పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పాలు, గుడ్లు,మాంసం, చేపలు ఎక్కువగా తీసుకోవడం వలన రక్తహీనత లేకుండా సుఖప్రసవము అవుతుందని అన్నారు. బరువు తక్కువ పిల్లలు పుట్టడం వలన వారికి ఎలాంటి అనారోగ్యం వచ్చిన అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. బరువు తక్కువ పిల్లలకు అంగన్వాడి కేంద్రంలో ప్రత్యేక శ్రద్ధతో , సమతుల్య ఆహారం ఇస్తూ వారికి అదనంగా ఒక గుడ్డు, 100ఎంఎల్ పాలు, మురుకులు, పప్పు,బాలామృతం ప్లస్ ఇచ్చి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నట్లు, ప్రతినెల పిల్లల బరువులు తీయించుకొని వారి గ్రోత్ ను తెలుసుకోవాలని తల్లులకు తెలిపారు. విటమిన్లు మినరల్స్ అన్ని రకాల పోషకాలు గల ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సునీత, అనుష, సుష్మా, మౌనిక, సూచిత, అంగన్వాడి ఆయా సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS