TEJA NEWS

చాకలి ఐలమ్మ 129వ జయంతి కార్యక్రమంలో కలెక్టర్ తేజస్
కార్యక్రమానికి హాజరైన తుంగతుర్తి ఎమ్మాల్యే మందుల సామేల్


సూర్యాపేట జిల్లా : సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయ లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని, భూమికోసం, భుక్తి కోసం పోరాటం చేసిన మహా నాయకురాలని ప్రజలు పడుతున్న ఇబ్బందులను, వెట్టిచాకిరిని చూసి చలించిపోయారని, ప్రజలందరికి స్వేచ్ఛ కోసం, భూమి కోసం, విముక్తి కోసం పోరాడిన వీరవనిత అని కలెక్టర్ కొనియాడారు. ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేసి రాబోవు తరానికి గొప్ప అభివృద్ధిని అందించి వారు అసువులు బాపరని కలెక్టర్ తెలిపారు. ప్రజలందరినీ ఐక్యం చేసి పోరాడుతూ దోరలపై విజయం సాధించిన చాకలి ఐలమ్మ అని ఆమె త్యాగాన్ని పోరాటపటిమని అందరికీ తెలిసేలా స్మరించుకోవాలని ఆయన అన్నారు. మహిళా పోరాట శక్తికి ప్రితికగా ఐలమ్మ నిలిచారని, ఐలమ్మ చూపిన తెగువ, శౌర్యం, ధైర్యం ప్రతి ఒక్కరిలో ప్రేరణ కల్పించిందన్న అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని నేటి తరం పునికిపుచ్చుకోవాలని, ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా పేదల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ కోరారు.

తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా పోరాటాలకు నిలయమని, దొరల నియంతృత్వ పాలన అంతమోందించడానికి వీరులను కన్నా బిడ్డ ఈ నలగొండ అని ఆనాటి రజాకారులను, నైజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ ఈ గడ్డ అని ఎమ్మెల్యే అన్నారు. భూమికోసం, భుక్తి కోసం, పోరాడిన మహనీయులు, వారు చేసిన త్యాగాల వల్లనే మనం అన్ని రకాలుగా అనుభవిస్తున్నామని గుర్తు చేశారు. గడిలో గడ్డి మొలవాలి అని ధైర్యంగా ఎదురించిన మహిళ చాకలి ఐలమ్మ అని, చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మనందరం ముందు సాగాలని ఎమ్మెల్యే తెలిపారు. నల్గొండ జిల్లాలో దొరల పాలనకు ఎదురొడ్డి పోరాడిన సంఘటనను శాసనసభ్యులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత పాలకులు చాకలి వేలమ్మ పోరాటాన్ని చేసిన త్యాగాన్ని మరిచారని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి మహిళలు, ప్రజల విన్నపం మేరకు హైదరాబాదులోని కోటీ లో ఉన్న మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ మహిళ యూనివర్సిటీగా పేరు పెట్టారని పోరాట యోధురాలు పుట్టిన గడ్డ నల్గొండ జిల్లా అని దొరలపై పోరాడి గడిల ను గడగడ లాడించిందని, బాంచన్ నీ కాలుముక్త అన్న జనం చేత, బంధుకు పట్టించిందని, చదువు ఉంటేనే జ్ఞానం ఉంటుందని అక్కడే పోరాటం పుడుతుందని, నవ సమాజం కోసం పోరాడి గెలిచిన మహిళ చాకలి ఐలమ్మని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని త్యాగాలు చేసిన త్యాగమూర్తులను, అసువులు బాపిన యోధులను స్మరిస్తూ జయంతి, వర్ధంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తుంగతుర్తి శాసనసభ్యులు తెలిపారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని తుంగతుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గత పాలకులు అందరినీ కట్టడి చేసి పాలించారని ఇప్పుడు ప్రజారాజ్యం వచ్చిందని అందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి డిటిడిఓ శంకర్, ఎస్సీ అభివృద్ధి అధికారి లత, టీఎన్జీవోస్ సెక్రటరీ దున్న శ్యామ్, సట్టు నాగయ్య, చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్. చాకలి ఎస్సీ సాధన సమితి జిల్లా అధ్యక్షులు బి. ఉపేందర్ ,రజక సంఘం అధ్యక్షులు గుండారపు శ్రీను, రజక సంఘం అధ్యక్షులు మాచర్ల అచ్చయ్య, రజక ఎంప్లాయిస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మల శ్రీనివాస్, రజక ఎంప్లాయిస్ జిల్లా ప్రెసిడెంట్ రావులకోటయ్య, ఏ చంద్రయ్య, ఏ పద్మ, కోడూరు నిర్మల, బుత్త రాజు శైలజ ,జి శివ, జై సైదులు ఎంప్లాయిస్ టౌన్ ప్రెసిడెంట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


TEJA NEWS