సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ కాలనీలో రోడ్డు నెంబర్ 4 లో పదిహేడు లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, రాజేష్ చంద్ర, వీరస్వామి జ్యోతిబా, సాయి, కోటేశ్వరరావు, రామయ్య చౌదరి, బాలు, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…