TEJA NEWS

శానిటేషన్ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేసిన ఎన్ఎండి ఫయాజ్ , ఖండే శ్యామ్ సుందర్ లాల్

నంద్యాల టౌన్ 12వ వార్డు బాలాజీ కాంప్లెక్స్ నందు 12వ వార్డు కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్ ఆధ్వర్యంలో 12వ వార్డు సచివాలయంలో ఉన్న శానిటేషన్ సిబ్బందికి దుస్తులను పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పాల్గొని దసరా పండుగ సందర్భంగా శానిటేషన్ సిబ్బందికి దుస్తులను పంపిణీ చేయడం జరిగింది

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ దసరా పండుగ అనేది హిందువుల ముఖ్యమైన పండుగలలో ఒక పెద్ద పండుగని ఈ పండుగను ప్రజలందరూ కలిసికట్టుగా చేసుకుంటారని ఈ దసరా రోజుల్లో అమ్మవారి బొమ్మలను వాడవాడల నెలకొల్పి పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులు అవుతారని . ఇలాంటి మంచి పండుగ రోజు 12వ వార్డు కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని శానిటేషన్ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేయడం చాలా మంచి పరిణామమని అందరూ నూతన దుస్తులను ధరించి ఆహ్లాదకర వాతావరణంలో దసరా పండుగను జరుపుకోవాలని

ఈ కార్యక్రమంలో బింగుమళ్ళ శ్యామ్ సుందర్ గుప్త , కండె ఆనంద్ , చింతల కుమార్, గెలివి శేఖర్,చలంబాబు , మలిపెద్ది నాగరాజు, జనార్ధన్, జయకర్, అమృత్, ఇసుక చాంద్ , చంద్రమౌళి, దస్తగిరి ,శానిటరీ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS