TEJA NEWS

తిరుపతి జిల్లా…

ఘనంగా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఎస్పీ..

సంస్కృత ఆదికవిగా ప్రసిద్ధి చెందిన వాల్మీకి మహర్షి రచించిన “రామాయణం మహాకావ్యం” సమస్త మానవాళికి ఆదర్శం.

జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్.,

శ్రీ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం లో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., శ్రీ వాల్మీకి మహర్షి చిత్ర పటానికి పూల మాల వేసి, ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రత్నాకరుడు అనే ఒక సాధారణ వ్యక్తి నారద మహర్షి ఉపదేశించిన తారక మంత్రం ను జపిస్తూ, సంస్కృత సాహిత్యంలో సంపూర్ణ జ్ఞానం పొంది, వాల్మీకి మహర్షిగా మారిపోయారు. ఫలితంగా సమస్త మానవాళికి ఆదర్శప్రాయమైన శ్రీ రామాయణ మహా కావ్యాన్ని సంస్కృతంలో రచించి సంస్కృత ఆదికవిగా పేరు పొందారన్నారు.

వాల్మీకి జయంతి రోజు ఆ మహానుభావుని జీవిత విశేషాలు తెలుసుకొని, ఒక ఆదర్శ గురువుగా ఆయన చూపిన మార్గంలో నడవడమే ఆ మహర్షికి మన ఇచ్చే నిజమైన గురు దక్షిణ అనీ, ఇలాంటి మహనీయుని వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీ వెంకట్రావు పరిపాలన, శ్రీ రవి మనోహర చారి శాంతి భద్రతలు, శ్రీ శ్రీనివాసరావు సాయుధ దళం, డీఎస్పీలు గిరిధర ఎస్బి, రమణయ్య ఏఆర్, ఏ.ఏ.ఓ శ్రీమతి జయలక్ష్మి, సీఐలు ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


TEJA NEWS