31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 31న దీపావళి ఆస్థానం నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఆస్థానం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా ఆ రోజు తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.