మంగళగిరిలో “”జనవాణి””…ప్రజా సమస్యల పరిష్కార వేదిక….
ప్రజా ప్రభుత్వ పాలనకు నిదర్శనం నేటి ప్రభుత్వం…
సాధ్యమైనంతమేర శరవేగంగా ప్రజా సమస్యలు పరిష్కారం.
మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో జనవాణి కార్యక్రమంలో రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ..
జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని సదుద్దేశంతో “జనవాణి” అనే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సంగతి విదితమే… అందులో భాగంగా అమరావతిలో నేడు రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ నాయకులు, అధికారులతో కలిసి ఈ “జనవాణి” కార్యక్రమంలో పాలొన్నారు..
ఈ జనవాణి వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని ప్రజలు ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా ముందుగా అర్జీ రూపంలో శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ కి అందజేసి…సంబంధిత అధికారులతో అక్కడే మాట్లాడి సాధ్యమైనంతమేర అక్కడే సమస్యను పరిష్కరిస్తున్నారు..