TEJA NEWS

వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున

అనంతపురం జిల్లా:
అనంతపురంలో రాత్రి భారీ వర్షం కురిసింది, ఈ భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది, పండ మేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది,

దీనిలో భాగంగా సినీ నటుడు అక్కినేని నాగార్జున వరదలో చిక్కుకున్నారు. అనంతపురంలో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవం లో ఆయన పాల్గొనాల్సి ఉంది. పుట్టపర్తి నుంచి రోడ్డు మార్గంలో అనంత పురం వెళ్తున్న సమయంలో ఆయన ప్రయాణీస్తున్న కారు వరదలో చిక్కుకుంది.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మరో దారిలో పుట్టపర్తి నుంచి అనంత పురానికి ఆయనను తీసుకువస్తున్నారు. అనంతపురంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు పండమేరు వాగు ఉప్పొంగింది.

వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రవాహం పెరుగుతుండ డంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు యంత్రాంగం తరలిస్తోంది. భారీ వర్షాలకు 44 పై భారీగా వర్షపు నీరు చేరడంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహన దారులు వదర నీటిలో ఇబ్బందులు పడ్డారు.


TEJA NEWS