TEJA NEWS

పెండింగ్ లో ఉన్న 4 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి:
బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నేత లింగయ్య యాదవ్

సూర్యాపేట జిల్లా : గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో 4 వేల కోట్ల ఉన్న ఫీజ్ రియంబర్స్ మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి కొత్త బస్టాండు బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్ద విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీతో మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భగా లింగయ్య యాదవ్ మాట్లాడుతు ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన విద్యార్థుల జీవితాలతో చెలగాటమడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల పై చదువులకు వెళ్లాలంటే విద్యార్థుల స్కాలర్షిప్లు రాక యజమాన్యాలు విద్యార్థుల ఇబ్బందులకు గురిచేస్తున్నారు .

అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు సొంత భవనాలు లేక సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు అల్లాడుతున్నారు తక్షణమే ప్రభుత్వాలు సొంత భవనాలు కట్టించి అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ చార్జీలు పెంచి విద్యార్థులకు నెలనెలా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్ర సచివాలయనీ ముట్టడిస్తం అని హెచ్చరిస్తున్నాం .ఈ కార్యక్రమం లో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోలోజు మహేశ్ చారి జిల్లా కన్వీనర్ బయ్య రాజేష్ , జిల్లా కార్యదర్శి పరల సాయి కుమార్, పెంపహాడ్ మండల అధ్యక్షుడు దుబాయ్ మల్లేష్ యాదవ్, లింగంపల్లి మధుకర్, అధిల్ భాయ్, విద్యార్థులు ఏర్పుల గౌతమి ,అనూష, జటంగి బావిత, ప్రణవి ,శైలజ ,మహేశ్వరి, శాన్వి శారద సౌజన్య సోనీ గణేష్ తదితర విద్యార్థులు పాల్గొని ర్యాలీ ,ధర్నాని విజయవంతం చేశారు.


TEJA NEWS