గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో జగన్ పర్యటన
గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో జగన్ పర్యటన
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బుధవారం గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుంటారు. రౌడీషీటర్ దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబ సభ్యులను కలిసి పరామర్శిస్తారు. మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లా బద్వేల్‌కు చేరుకుని ప్రేమోన్మాది దాడిలో చనిపోయిన యువతి కుటుంబాన్ని పరామర్శిస్తారు.