TEJA NEWS

గుంటూరు
తేది: 15-2-2024
రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణహిత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని,గ్రామాలు, పట్టణాల్లో ఉన్న చెరువుల అభివృద్ధి వలన ఆహ్లాదం, భూగర్భ జలాల పెంపు సాధ్యమవుతుందని రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ తెలిపారు.

గురువారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అంకిరెడ్డిపాలెం చెరువులో అమృత్, ఏపి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫీకేషన్ కార్పోరేషన్ (ఏపిజిబిసి)ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి, ఏపిజిబిసి అధికారులతో కలిసి పరిశీలించి,చెరువు అభివృద్ధి పనుల ప్లాన్ ని మ్యాప్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకొని, అంతర్జాతీయ ప్రమణాలతో పనులను వేగంగా చేయాలని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న హరితవనాల పెంపు, చెరువుల అభివృద్ధి ద్వారా పర్యావరణహిత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అంకిరెడ్డిపాలెం చెరువును రూ.5.30 కోట్ల అమృత్ 2.0, ఏపిజిబిసి నిధులతో అత్యంత సుందరంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

చెరువు కట్ట బలోపేతం,కాంపౌండ్ వాల్, చెరువు కట్ట కుంగకుండా రాతి బండల ఏర్పాటు, పచ్చదనం కోసం గ్రాస్ లాన్, మొక్కలను పరిశీలించారు.

పెండింగ్ పనులను నిర్దేశిత గడువు మేరకు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఏపిజిబిసి అధికారులను ఆదేశించారు.

వాకింగ్ ట్రాక్ ని ప్రజలు అధిక సంఖ్యలో వినియోగించుకునే అవకాశం ఉన్నదని అందుకు తగిన విధంగా ఏర్పాటు చేయాలన్నారు.

కాంపౌండ్ వాల్ ఎత్తుగా ఉండేలా అధికారులు చూడాలని,ట్రాక్ లో టాయ్ లెట్స్ ఏర్పాటు చేయాలన్నారు.

త్వరలో పనులు పురోగతి పై పునఃపరిశీలన చేస్తామని తెలిపారు.

ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి మాట్లాడుతూ అంకిరెడ్డిపాలెంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టామని,జిల్లా పరిషత్‌ హైస్కూలును ఆధునీకరించడంతో పాటు అదే ఆవరణలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉండేలా జూనియర్‌ మహిళా కళాశాల ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

స్మశానవాటికను అందమైన పూదోటలా తీర్చిదిద్దడంతో పాటు మల్టీపర్పస్‌గా ఆధునీకరించడంపై దృష్టి సారించినట్లు చెప్పారు.

చెరువు చుట్టూ గ్రీనరీతో సర్వాంగ సుందరంగా మలిచి.. అందరికీ ఉపయోగపడేలా వాకింగ్‌ ట్రాక్, ఓపెన్‌ జిమ్,క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బాస్కెట్‌బాల్‌ కోర్టు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

పర్యటనలో ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎం.డీ రాజశేఖరరెడ్డి, అధికారులు,అమృత్ ప్రతినిధులు, జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


TEJA NEWS