TEJA NEWS

బైక్ ను ఢీ కొట్టిన లారీ

బైకిస్టుకు తీవ్ర గాయం ఆసుపత్రికి తరలింపు

షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న భారత్ పెట్రోల్ పంపు ఎదురుగా ఓ లారీ బైక్ ను ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. లారీ నెంబర్ టీఎస్ 09 ఈఆర్ 3391 బైక్ పై ఇద్దరు వ్యక్తులు వీరేందర్, మహేందర్ వెంకమ్మ గూడ గ్రామం నుండి షాద్ నగర్ వస్తుండగా లారీ ఢీకొట్టడంతో కాలికి బలమైన గాయం తగిలింది. పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వెంకమ్మ గూడకు చెందిన మహేందర్ గా తెలిపారు. లారీ డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ ప్రమాదానికి కారణం అయినట్టు చెబుతున్నారు..


TEJA NEWS