TEJA NEWS

వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సమయం సరిపోక చాలామందికి చూడలేకపోయామని తెలిపారు. మరో 10 రోజుల్లో ఈ వైద్య శిబిరం మళ్లీ నిర్వహిస్తామని తెలియజేసిన….ట్రస్టు చైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి

ఎస్పీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇకనుండి దశలవారీగా బస్తీలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆ ట్రస్టు చైర్మన్ సొంటి రెడ్డి పున్నారెడ్డి అన్నారు. గాజుల రామారం డివిజన్ చిత్తారమ్మ దేవి నగర్ లో శనివారం ఎస్ పి ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న ఎస్పిఆర్ గ్లోబల్ స్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సొంటి రెడ్డి పున్నారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించగా కుత్బుల్లాపూర్ వివిధ ప్రాంతాల నుండి వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనుభవజ్ఞులైన వైద్యులచే 250 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు . చూపు మందగించిన వారికి కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొంటిరెడ్డి పున్నారెడ్డి మాట్లాడుతూ మన శరీర అవయవాల్లో అత్యంత ముఖ్యమైనవి కళ్ళు అని, నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం కారణంగా చిన్న నుండి పెద్దవారి వరకు చాలామందికి చూపు మందగించిందన్నారు. పేద మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకొని


TEJA NEWS