TEJA NEWS

హనుమకొండ జిల్లా…
తేది:-02-11-2024….

హనుమకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నందు ఏఐసిసి మరియు టిపిసిసి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) పై విస్తృత స్థాయి సమావేశంలో హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ గారు, పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు ఎమెల్సీ శ్రీ బస్వరాజు సారయ్య గార్ల తో కలిసి పాల్గొని అవగాహన కల్పించిన గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు….

అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మాట్లాడుతూ:-

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సమావేశం చేపడుతున్నది….

బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని కులగణన చేపట్టింది

కుల గణన అన్ని కులాల వారు పాల్గొని బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు

దేశంలోనే కుల గణన చేపట్టిన మొదటి రాష్ట్రం గా తెలంగాణ రాష్ట్రం ఖ్యాతి గడించనుంది..

పేద బలహీన వర్గాల వారు అత్యున్న స్థాయికి వెళ్లడానికి కుల గణన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

70% ఉన్న బలహీన వర్గాల వారు సామాజికంగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కుల గణన ఉపయోగపడుతుంది..

అనంతరం బీసీ సంఘాల నాయకుల సలహాలు సూచనలు స్వీకరించి వారు అందజేసిన వినతులను ఏఐసీసీకి మరియు టిపిసిసి కి పంపిస్తామని నాయకులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యేలు తెలియజేయడం జరిగింది….

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ రియాజ్, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ మరియు డివిజన్ స్థాయి నాయకులు కార్యకర్తలు మరియు ప్రొఫెసర్ వెంకట్ నారాయణ గారు, సుధాకర్,గారు మరియు బిసి కుల సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..


TEJA NEWS