50000/- పైన ఆదాయం ఉన్న దేవాలయాల అర్చకుల జీతం 15000/- కి పెంచిన కూటమి ప్రభుత్వం ..
అర్చకులకు ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టు కున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3000 కి పైగా దేవాలయాల లో అర్చకుల కి లబ్ధి చేకూర్చే విధంగా , చిన్న దేవాలయాల అర్చకులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్ర బాబు కి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి కి,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి,జిల్లా లోని మంత్రి అనగానీ సత్య ప్రసాద్ కి, గొట్టిపాటి రవికుమార్ కి,స్థానిక శాసన సభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ కి కృతజ్ఞతలు
ఈ ఉత్తర్వులు వలన రాష్ట్రం లోని చిన్న దేవాలయాల లో పని చేసే అర్చకులకు ఆర్థిక భరోసా కలుగుతుంది.చిన్న దేవాలయాల మనుగడ సుసాధ్యం అయ్యేవిధంగా చూసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు
ఇట్లు
బృందావనం గోపి చంద్
ప్రధాన కార్యదర్శి
అర్చక సేవా సంఘం
బాపట్ల జిల్లా