నిజరూప దర్శనంలో పిల్లలమర్రి చెన్నకేశవస్వామి
_ కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా ప్రత్యేక అలంకరణ
సూర్యాపేట రూరల్ (పిల్లలమర్రి): మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి చెన్నకేశవస్వామి వారి నిజరూప దర్శనాన్ని అర్చకులు రఘువరన్ ఆచార్యులు భక్తులకు కల్పించారు.కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా ఉదయం అభిషేకం నిర్వహించి తదుపరి స్వామీ వారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ పిల్లలమర్రిలోని చారిత్రాత్మక ఆలయంలో ఒకటిగా ఉత్తర ముఖ ద్వారం కలిగి శ్రీ లక్ష్మీ సమేతంగా స్వామీ వారు ఇక్కడ కోలువు దీరటం విశేషమని అన్నారు.భక్తులు తమ కోర్కేలు తీరుటకు 11 ప్రదక్షిణలు చేసి స్వామీ వారికి ముడుపు కట్టటం జరుగుతుంది అన్నారు. కోరిన కోర్కెలు తీర్చే కోంగు బంగారంగా స్వామీ అనుగ్రహం భక్తులపై చూపుతారన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ థర్మకర్త ఉమ్మెంతల హరిప్రసాద్ ఆలయ చైర్మన్ గూకంటి రాజాబాబు రెడ్డి కమిటీ సభ్యులు కందకట్ల రాంబాబు మంగపండ్ల మల్లికార్జున్ బంగారి కిష్టయ్య బంగారి సైదమ్మ మల్లయ్య తూటిపల్లి జానయ్య భక్తులు ముడుంభై సారిక గవ్వ విజయలక్ష్మీ సువర్ణ అంకం బిక్షం మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.