తెలంగాణలో టిడిపికి పూర్వ వైభవం రావడం ఖాయం……… టిడిపినాగర్ కర్నూల్ పార్లమెంటుకన్వీనర్ బోలె మోని రాములు
సాక్షిత వనపర్తి నవంబర్ 12
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం రావడం ఖాయమని తెదేపా నాగర్ కర్నూల్ పార్లమెంట్ కన్వీనర్ బొలమోని రాములు మాజీ జెడ్పిటిసి గొల్ల వెంకటయ్యలు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ 2024- 26 సంవత్సరానికి గాను ఆన్లైన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అయిందని నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకుడు, కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసుకోవాలని కోరారు మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ముఖ్య స్వార్థ నాయకులు పార్టీని వీడడం జరిగిందని కొత్తగా రాష్ట్రం ఏర్పడిన క్రమంలో పదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష పేరుతో తెదేపా ముఖ్య నాయకులతో పాటు పార్టీ తరఫున గెలిచిన నాయకులను ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీలో చేర్చుకోవడం జరిగిందని నేడు ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయి చతికిలబడిపోయిందని ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గ్యారంటీలను ఏ ఒక్క వాటిని నెరవేర్చలేదని బి ఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోయారని తెలంగాణలో గత దశాబ్ద కాలంగా తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడిందని అయినా క్షేత్రస్థాయిలో పార్టీ అస్తిత్వాన్ని కోల్పోలేదని పార్టీ కార్యక్రమాలు మొదలైతే ఆయా పార్టీల నాయకులు అంతా పార్టీలో చేరడం ఖాయమని అయినా టిడిపి గత పొరపాట్లను పునరావృతం కాకుండా ఉన్న నాయకుల చేతనే పార్టీకి పునర్జీవం తీసుకొస్తామని అభిప్రాయం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో ఉన్న తెదేపా ప్రతి నాయకుడు కార్యకర్త ఆన్లైన్ సభ్యత్వాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సభ్యత్వ నమోదు చేసుకోవడం వలన ప్రతి ఒక్కరికి ఐదు లక్షల బీమాను పదివేల మట్టి ఖర్చులు పార్టీ ఇస్తుందని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు బాల్ లింగయ్య దస్తగిరి కాగితాల లక్ష్మీనారాయణ అడ్వకేట్ షాకీర్ హుస్సేన్ కొత్త గొల్ల శంకర్ జగత్ పల్లి మాజీ సర్పంచ్ హుస్సేన్ కేతపల్లి గోపాల్ నాయుడు బాలరాజు శ్రీనివాస్ రెడ్డి నాగరాజు వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో టిడిపికి పూర్వ వైభవం రావడం ఖాయం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…