TEJA NEWS

న్యాయవాదులపై దాడులను ఖండించాలి.

న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలి..

సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
పెగడపెల్లి : భాగ్యనగర్ లో ఇస్లాం మతానికి చెందిన కొందరు దుండగులు న్యాయవాది కళ్యాణ్ పై మంగళవారం ఉదయం హత్యాయత్నం చేశారని దీన్ని తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరు ఖండించాలని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి న్యాయవాది మర్రిపెల్లి సత్యమ్ పిలిపునిచ్చారు.. హిందూ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే న్యాయవాది కళ్యాణ్ ను టార్గెట్ గా చేసుకొని కత్తులతో దాడికి దిగడం హేయమైన చర్య అని అన్నారు.మంగళవారం ఉదయం ఖైరతాబాద్ సమీపంలోని (ఐమాక్స్ ) ప్రసాద్ థియేటర్ సమీపంలో ఒంటరిగా వెళుతున్న అడ్వకేట్ కళ్యాణ్ ను చంపేందుకు ఇస్లాం మతానికి చెందిన కొందరు కత్తులతో దాడికి తెగబడి అటుగా వెళుతున్న కళ్యాణ్ కు రాంగ్ రూట్లో ఎదురుగా వెళ్లి దాడికి పాల్పడ్డారని తప్పించుకునే క్రమంలో చేతులు అడ్డు పెట్టడంతో ప్రాణాపాయ స్థితిలో నుంచి బతికి బయటపడ్డారని అన్నారు.అయితే దీనిని సెల్ ఫోన్ దొంగల ముఠాగా చిత్రీకరించేందుకు పోలీసులు వక్రీకరించడం భావ్యం కాదని అన్నారు.. హిందూ నాయకులను టార్గెట్ గా చేసుకొని హత్యాయత్నం కొనసాగించడం అత్యంత అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదిగా సమాజ సేవలో పాల్గొంటున్న కళ్యాణ్ పై దాడికి దిగడం దిగ్భ్రాంతి కలిగిస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇటీవల క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయని.. దాడులకు పాల్పడ్డ వారందరూ పిచ్చి వాళ్లని సర్టిఫికెట్ ఇవ్వడంలో సఫలీకృతం అవుతున్న ప్రభుత్వం.. ఈ దాడిని కూడా దొంగల ముఠాగా చిత్రీకరించడం తగదని హెచ్చరించారు. సెల్ ఫోన్ దొంగలకు కత్తులతో వెంబడించి కసిగా పొడవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు. ఇంతటి మహానగరంలో పట్టపగలు, నడిరోడ్డుపై కత్తులతో దాడికి చేసి పారిపోయినప్పటికీ పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వ్యవహరించడం ఏమాత్రం తగదు అన్నారు. కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ కరువైందని, పట్టపగలే హత్యలు జరుగుతున్న కూడా పట్టించుకోవడంలేదని తీవ్ర విమర్శలు చేశారు. చీమ చిటుక్కుమన్నా పట్టుకునే రీతిలో దేశానికే ఆదర్శంగా ఉన్న హైదరాబాద్ సిసి కెమెరాలు మూత పడ్డాయా ? అని ప్రశ్నించారు.దాడి వెనుక ఎంతమంది పెద్దల హస్తం ఉన్న వదిలిపెట్టకుండ విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకొని న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..

భవదీయ

పగుడాకుల బాలస్వామి
ప్రచార ప్రముఖ్
విశ్వహిందూ పరిషత్
తెలంగాణ
9912975753
9182674010


TEJA NEWS