TEJA NEWS

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం

క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

అమరావతి: ‘ఔట్ సోర్సింగ్ విధానంలో ఆప్కాస్ ద్వారా ఉద్యోగాల్లో చేరాము. మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 23 నెలలుగా విధులు నిర్వహిస్తున్నాము. విధుల్లో చేరిన నాటి నుంచి వేతనాలు లేవు. అప్పులు చేసి కుటుంబాలు నెట్టుకొస్తున్నాము. మేము పని చేసిన కాలానికి జీతాలు ఇప్పించండి సార్. ఉద్యోగ భద్రత కల్పించండి’ అంటూ గత నెలలో మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి వారి క్యాంపు కార్యాలయం వద్ద ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు. సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి జీతం బకాయిల సమస్యను పరిష్కరించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల కావడం పట్ల మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. గత రెండేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను నాలుగు వారాలలోపు పరిష్కరించినందుకు పవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంటామన్నారు.


TEJA NEWS