25న వాయుగుండం.
ఏపీలో దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్యదిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో 23 నాటికి అల్ప పీడనంగా మారనుందని పేర్కొంది. 25 నాటికి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయు గుండంగా మారుతుందని అధికారులుతెలిపారు దీని ప్రభావంతో 25 నుంచి దక్షిణ కోస్తా,రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.