ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష
దీక్షకు మద్దతు తెలిపిన రాజకీయ విపక్షాలు
వనపర్తి
వికలాంగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు మొదలుపెట్టిన రిలే నిరాహార దీక్షలకు భారతీయ జనతా తో పాటు ఇతర పార్టీలు పార్టీ రాష్ట్ర నాయకులు సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు మెంటే పల్లి పురుషోత్తం రెడ్డి భారతీయ జనతా పార్టీ తరఫున మద్దతుగా నిలిచి గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దివ్యాంగులకు 4000/- నుండి 6000/-కు, కండరాల క్షీణత కలిగిన దివ్యాంగులకు 4,000 నుండి 15000/- వేలకు పెంచాలని,చేయూత పెన్షన్ 2016 నుండి 4016/- కు పెంచాలని, దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, దివ్యాంగులకు 2016 దివ్యాంగ చట్టం అమలుపరచాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ మొదలుపెడతామని బిజెపి రాష్ట్ర నాయకులు సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు మెట్పల్లి పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు.
కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రామన్న వెంకటేశ్వర్ రెడ్డి వనపర్తి మండల అధ్యక్షులు సంద వెంకటేష్ వనపర్తి పట్టణ అధ్యక్షులు బచ్చు రాము ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వెంకటస్వామి పట్టణ ప్రధాన కార్యదర్శి మామిళ్ళపల్లి రాయన్న సాగర్ తదితరులు పాల్గొన్నారు