TEJA NEWS

ప్రత్తిపాటి నాగరాజు మృతి చాలా బాధాకరం.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు .

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం

మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ప్రత్తిపాటి కిరణ్ కుమార్ తండ్రి ప్రత్తిపాటి నాగరాజు ఆకస్మిక మరణం చాలా బాధాకరమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఈనెల 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగరాజు మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు వెల్వడం గ్రామంలోని వారి నివాసానికి చేరుకుని, ప్రత్తిపాటి నాగరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS