ప్రజాపాలన విజయోత్సవాలు విజయవంతం చేయాలి: మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్
శంకర్పల్లి : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శంకర్పల్లి పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం అర్బన్ డేలో భాగంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు రోజువారి కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో పురపాలక సంఘం సిబ్బంది పాల్గొన్నారు.