TEJA NEWS

తల్లిదండ్రులు లేని అనాధ చిన్నారి పావనిని ఆదరించండి

రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పల్లె సింధురరెడ్డిని కోరిన అవ్వ రామక్క..

పుట్టపర్తి :
తల్లి తండ్రి లేని దిక్కులేని అభాగ్యురాలిగా ఉన్న చిన్నారి పావని(5) ని ఆదరించాలని కొట్లపల్లికి చెందిన చిన్నారి అవ్వ రామక్క పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి విన్నవించారు. పుట్టపర్తి మండలంలోని కోట్లపల్లి పంచాయతీలో జరిగిన రెవిన్యూ సదస్సుకు హాజరైన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి తల్లి తండ్రి లేని ఓ చిన్నారితో ఉన్న వృద్ధురాలు కంట పడింది. ఆ వృద్ధురాలను ఎమ్మెల్యే దగ్గరికి పిలిపించుకొని వారిని ఆప్యాయంగా పలకరించారు. చిన్నారి అవ్వ రామక్కా తో జరిగిన విషాద గాథను అడిగి తెలుసుకున్నారు.

కొట్ల పల్లికి చెందిన పావని తల్లి సునీత ను తండ్రి శంకర్ మూడు మాసాల క్రితం అత్యంత దారుణంగా కొట్టి చంపేశారని చిన్నారి అవ్వ వృద్ధురాలు రామక్క ఎమ్మెల్యే పల్లె సిందూర ,ఆర్డీఓ సువర్ణ, తహశీల్దార్ అనుపమ దృష్టికి తీసుకువచ్చారు. ఈ పాప తండ్రి శంకర ప్రస్తుతం జైల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై చలించిపోయిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆ చిన్నారి పావనిని దగ్గరికి తీసుకొని కన్నీళ్లు కార్చారు. అక్కడే రోదిస్తున్న చిన్నారి అవ్వ రామక్క ను ఎమ్మెల్యే ఓదార్చారు. ఈ పాపకు దిక్కు ఎవరూ లేరని నా వయసు కూడా పైబడిందని ఇంకా ఎవరు చూసుకుంటారని ఆ వృద్ధురాలు కన్నీళ్ల పర్వతమయ్యారు. ఆ చిన్నారి పావనీకి తప్పకుండా ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే తో పాటు ఆర్డీవో తాహసిల్దార్ రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS