రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి
87వార్డ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా 87వ వార్డ్ పరిధిలో లక్ష్మీపురం, సిద్ధార్థ నగర్, కణితి అంబేద్కర్ కాలనీ, పాత వడ్లపూడిలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, 87 వార్డు కార్పొరేటర్ బోండా జగన్నాథం (జగన్) పాల్గొని ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగానికి ప్రధాన రూపశిల్పి.
భారతదేశంలోని వివిధ కులాల అభివృద్ధికి ఆయన అనేక పనులు చేశారు, ప్రధానంగా అంటరానితనాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించారు.ప్రజలందరూ రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగ పడే విధంగా ఉండాల, ఆయన మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టమని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డ్ అభివృద్ధి కమిటీ చైర్మన విజయరామరాజు, సీనియర్ నాయకులు పావడ రమణమూర్తి, జాన్ రమేష్,దాలయ్య, ఏటీయన్ మూర్తి,బలిరెడ్డి నాగేశ్వర రావు, మూర్తి, శ్రీరాములు,ఆయా ప్రాంతాలకు చెందిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు