TEJA NEWS

నడివీధి గంగమ్మకు సారె సమర్పించిన తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష.

తిరుపతి పెద్దకాపు వీధి నడివీధి గంగమ్మ కు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ గుడి నుండి మేళతాళాలతో ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష సారె అందజేశారు.
ప్రతి యేటా జరిగే పెద్ద కాపు వీధి నడివీధి గంగమ్మ జాతర ఆనవాయితీగా ఆ గ్రామ పెద్దలు నిర్వహించడం జరుగుతుంది పెద్దలు తెలియజేశారు.

ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష దంపతులు పాల్గొని నడివీధి గంగమ్మకు తాతయ్యగుంట గంగమ్మ గుడి నుండి మేళతాళాలతో సారె అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ప్రతి ఏటా పెద్ద కాపు వీధిలో నడివీధి గంగమ్మకు ప్రత్యేక కుంభం వేసి, అంబిలు పోసి పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. పెద్దలు, మహిళలు పాల్గొని వారి వారి మొక్కులు తీర్చుకుంటారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు గ్రామ పెద్దలు, దొడ్డా రెడ్డి సిద్ధారెడ్డి, యాలమురి శ్రీనివాసరెడ్డి, మునయ్య యాదవ్, డాక్టర్ మునిశేఖర్, శేఖర్ రెడ్డి, శంకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మునికృష్ణారెడ్డి, భరణి యాదవ్, హేమంత్ కుమార్, నరేంద్ర,భక్తులు పాల్గొన్నారు.


TEJA NEWS