TEJA NEWS

పేదల బియ్యం బొక్కేస్తున్నారు

రేషన్ మాఫియా కు కళ్లెం వేసిన విజయవాడ పశ్చిమ తహశీల్దారు ఇంతీయాజ్ పాషా

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 41 వ డివిజన్ భవానిపురం లో ఉదయం 9 గంటలకు పశ్చిమ తహశీల్దారు మరియు వారి సిబ్బంది తో D No 75-5-171, ప్రేసిడెంట్ వీధి లో మరమ్మత్తు లో వున్న బిల్డింగ్ లో 2500 KG లు PDS రైస్ సుమారు 50 bag లను పట్టుకున్నారు. సదరు ఇల్లు SK. ఖుద్దస్ గారిది అయి వుండగా,కొల్లి తిరుపతమ్మ అనే మహిళ అక్రమంగా పీడీఎస్ రైస్ నిల్వ వుంచింది అని స్థానికులు తాసిల్దార్ ఇంతియాజ్ పాషాకు వివరించారు…

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పీడీఎస్ రైస్ ను నియంత్రిస్తున్న కూడా ఈ విధమైన పీడీఎస్ అక్రమ నిల్వ ,రవాణా ను గుర్తించి సివిల్ సప్లై అధికారులకు అప్పగించిన పశ్చిమ తహశీల్దారు ఇంతియాజ్ పాషా ని స్థానికులు అభినందించారు.

కొల్లి తిరుపతమ్మ గత కొంతకాలంగా రేషన్ మాఫియాని నడుపుతూ సంపాదినే ధ్యేయంగా పేదల బియ్యాన్ని బొకేస్తూ అక్రమార్గంలో అడ్డదారిలో అక్రమార్జన కి అలవాటు పడి రేషన్ మాఫియా డానుగా అవతారం ఎత్తిన కొల్లి తిరుపతమ్మకు ఎట్టకేలకు పశ్చిమ తాసిల్దార్ ఇంతియాజ్ పాషా, కళ్లెం వేశారు..

ప్రజలు ప్రభుత్వాన్ని కి సహకరించాలని ఎవరు కూడా రేషన్ బియ్యాన్ని అమ్ముకోవద్దని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ బియ్యం ప్రజల ఇంటి వద్దకే చేరవేసే కార్యక్రమం చేపట్టినప్పటికీ, ఆ రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న కొంతమంది మాఫియాలు వారి ఉనికి తెలిస్తే ఆ వివరాలను రెవెన్యూ అధికారులకు తెలియజేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు…

ఈ మెరుపు దాడులలో పశ్చిమ తాసిల్దార్ ఇంతియాజ్ పాషాతోపాటు ఇన్చార్జి ఆర్ఐ వెన్నెల, సివిల్ సప్లై ఆర్ఐ వెంకట్, విఆర్వోలు రాజేష్ యోసేపులు ఉన్నారు..


TEJA NEWS