TEJA NEWS

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ రాజకియానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కూకట్పల్లి నియోజకవర్గం లో తెలుగు తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి .

తెలంగాణ తల్లి పేరు చెప్పి కాంగ్రెస్ తల్లి పేరుతో ఈ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా కూకట్పల్లి నియోజకవర్గం లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్

తన మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చాక కూడా తన ప్రవర్తన మారటం లేదు.

నాడు సోనియా గాంధీని బలి దేవత అని నేడు సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు చేయడానికి సిగ్గు అనిపిస్తలేదా?

మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ.. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే.. పూలనే పూజిస్తూ కోట్లాది ఆడబిడ్డలు చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ..

అలాంటి మన బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలోంచి మాయం చేసి, కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టడం అన్యాయం..

ఒక పక్క ఆశా వర్కర్లను పోలీసులతో అరెస్టులు చేస్తూ లాఠీచార్జీలు చేస్తూ, తెలంగాణ తల్లి విగ్రహంలోని బతుకమ్మను తొలగించి యావత్ తెలంగాణ మహిళల మనోభావాలను దెబ్బతీస్తూ, మహిళాభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అనడానికి నీకు నోరేలా వచ్చింది?

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకో వాటిని మార్చి చరిత్రని మార్చాలనుకోవటం ని మూర్ఖత్వం.

ఆనాడు ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని ఎలా పాలించిందో, నేడు ని పాలన అదే తీరు తలపిస్తుంది.

నీకు ఏ మాత్రం చిత్త శుద్ది ఉన్న నీ ప్రవర్తన మార్చుకో ప్రజలను ఇబ్బందులకు గురిచేయకు అని ఈ సందర్భంగా తెలియజేశారు..


TEJA NEWS