TEJA NEWS

ప్రారంభమైన సహస్ర పూర్ణచంద్ర మహోత్సవం

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్

శ్రీకాకుళం పిఎన్ కాలనీలో వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంలో ప్రారంభమైన సహస్ర పూర్ణచంద్ర దర్శన శతాభిషేక మహోత్సవ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు, పండితులు స్వాగతం పలికి వేదమంత్రాలతో అర్చనలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సహస్ర పూర్ణచంద్ర దర్శన మహోత్సవ కార్యక్రమం శని, ఆది, సోమ మూడు రోజులపాటు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారని ప్రత్యేక పూజలులో కూర్చున్న డాక్టర్ నిక్కు అప్పన్నదంపతులు, వేదపండితులు నిర్వాహకులు తెలియజేశారు. ఈ పూజ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, నిర్వాహకులు, స్థానిక కూటమీ నాయకులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS