TEJA NEWS

ఏపీ వ్యాప్తంగా ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు

మోపిదేవి లో మూతపడిన*ఫెర్టిలైజర్ దుకాణాలు

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 40 విజిలెన్స్ అధికారుల బృందాలు ఎరువుల దుకాణాలు, గిడ్డంగులపై ఒకేసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండటంతో మోపిదేవి మండలంలో దుకాణాలు మూతపడ్డాయి. మూడు రోజులుగా కృష్ణా జిల్లాలో విస్తృతంగా విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేస్తూ ఉండగా తూనికలలో తేడాలు ఉన్నట్లు అధికంగా గుర్తించారు. మోపిదేవిలో దుకాణాలు మూడురోజులుగా తాళాలు వేసి ఉండటం చూసి… మందుల అవసరాల నిమిత్తం వచ్చిన రైతులు వెనుతిరిగి వెళుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ సోదాలు జరుగుతాయో ? దుకాణాలు ఎప్పటికీ తెరుచుకుంటాయో ?


TEJA NEWS