TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ నివాసం వద్ద పలువురు నాయకులు, పలు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి, వివిధ కాలనీలలో నెలకొన్న సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు.
పలు వినతులు స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే వాటి పరిష్కారం కోసం, ఆయా కాలనీల అభివృద్ధి కోసం సత్వర చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. పలువురు మాజీ ఎమ్మెల్యే కి పలు శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు అందజేశారు.

గాజులరామారం విలేజ్ లో సీసీ రోడ్ సాంక్షన్ చేయించినందుకు స్థానిక విలేజ్ వారు శ్రీశైలం గౌడ్ ని సన్మానించారు. అనంతరం శ్రీశైలం గౌడ్ సిసి రోడ్లు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కిష్టారెడ్డి, సంజీవరెడ్డి, ఎల్లారెడ్డి, వెంకట్ రెడ్డి, యాం సాగర్, టైసన్, యశ్వంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సుజిత్ రెడ్డి, ఋషి కుమార్ లక్ష్మారెడ్డి, వెంకట్ స్వామి, లక్ష్మయ్య, సురేష్ పాల్గొన్నారు


TEJA NEWS