TEJA NEWS

వంటవార్పుతో 5వ రోజు వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులు నిరసన

వేతనాలు పెంచాలని కోరుతూ వంటవార్పుతో 5వ రోజు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి గండికోట నాగవెంకటేష్ మాట్లాడుతూ
సమస్యల పరిష్కారానికి కై ఫిబ్రవరి 16వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలో ఉన్నారు. గత 22 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకి కనీసవేతనాలు అమలు చేయడం లేదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, టైం స్కేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల జీతాలు ఇవ్వాలి, టైంస్కేలు అమలు చేయాలని, ఈఎస్ఐ, పిఎఫ్ మరియు ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలు, ప్రసూతి సెలవులు, ప్రభుత్వ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జయచంద్ర, ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు, యూనియన్ అధ్యక్షురాలు వరలక్ష్మి, కార్యదర్శి రాకేష్, నాయకులు సుబ్బు, రేవతి, చంద్రమ్మ, అనురాధ, మునిలక్ష్మి, రమా, మురళి తదితరులు పాల్గొన్నారు.

నమస్కారములతో

గండికోట నాగవెంకటేష్
రాష్ట్ర కోశాధికారి
ఆల్ యూనివర్సిటీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్.


TEJA NEWS