TEJA NEWS

వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం

వందలాది మందికి అన్నదానం

ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. బాబా వారి విగ్రహాన్ని ప్రతిష్టించి 16 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులతో పంచామృతాలతో ఏక రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు. విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. స్వయంగా భక్తులకు ఆయన వడ్డించారు. తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు చింతల అనిల్ కుమార్ తో అటు స్థానిక పెద్దలు పాల్గొన్నారు. శ్రీ సాయి ప్రభ సేవా ట్రస్ట్ అధ్యక్షురాలు గరికిపాటి బాలా త్రిపుర సుందరి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.


TEJA NEWS