TEJA NEWS

అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి?

హైదరాబాద్:
అమెరికాలో ఆదివారం తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.హన్మకొండ జిల్లాకు చెందిన తెలుగు విద్యార్థి అమెరికాలో అనుమానా స్పద స్థితిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది.

హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు బండి రాజయ్య, లలితల రెండో కుమారుడు వంశీ (25) 2023 జులైలో అమె రికాలోని మిన్నెసొటాకు వెళ్లారు. అక్కడే ఎంఎస్‌ చదువుతూ, ఇటీవలే పార్ట్​టైం ఉద్యోగంలో చేరారు. పార్కింగ్‌ చేసిన ఓ కారులో మృతి చెందినట్లు సమా చారం..

వంశీ ఉంటున్న అపార్ట్‌ మెంట్ సెల్లార్‌లో పార్కింగ్‌ చేసిన ఓ కారులో మృతి చెంది ఉన్నట్లు అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న హనుమకొండ జిల్లాకు చెందిన కొందరు యువ కులు ఆదివారం రాత్రి 9.30 గంటలకు గుర్తించారు.

దీంతో వెంటనే వంశీ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వంశీ మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రుగా రోదిస్తున్నారు. వారిని హుజూరాబాద్‌ నియోజక వర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జీ వొడితల ప్రణవ్‌ పరామ ర్శించగా….

వంశీ భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.


TEJA NEWS