TEJA NEWS

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు

హైదరాబాద్:
సంధ్య థియేటర్‌ ఘటనకు సంబంధించిన వీడియోను రెండ్రోజుల క్రితం మీడియా ముందు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ రావటంతోనే తొక్కిసలాట జరిగినట్లు చెబుతూ.. వీడియోను రిలీజ్ చేశారు.

ఇదిలా ఉండగా.. తాజాగా మరో సీసీటీవీ ఫుటేజి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అల్లు అర్జున్ థియేటర్‌లోకి రాకముందే అపాస్మారక స్థితిలో ఉన్న రేవతిని బయటికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ పాయింట్‌ నే అల్లు అర్జున్ ఫ్యాన్స్, నెటిజన్లు లేవనెత్తుతు న్నారు.

అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందని కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిస లాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు.

అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్లు కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం తమ దృష్టికి వచ్చిందని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఇలా ఎడిటెడ్ వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,వార్నింగ్ ఇచ్చారు..


TEJA NEWS