తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
హైదరాబాద్:
ఇంటర్మీడియట్ విద్యార్థు లకు తెలంగాణ ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించింది,ఫీజు చెల్లించు కోలేని విద్యార్థులకు మరో చాన్స్..రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 31వ తేదీ వరకు ఫీజు చెల్లించు కోవచ్చని ప్రకటన విడుదల చేశారు.
నిజానికి ఈ గడువు డిసెంబర్ 17వ తేదీతోనే పూర్తి కాగా… తాజాగా డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించారు. కాగా రూ.2 వేల ఆలస్య రుసుముతో జనవరి 2వరకు ఫీజులు చెల్లించవచ్చు.అని తెలిపింది….
ఇంటర్ ఫస్టియర్ జనరల్ రెగ్యులర్ కోర్సుల ఫీజును రూ.520గా నిర్ణయించారు. ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ రెగ్యులర్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) కోర్సుల ఫీజు రూ.750గా ఉంది.
ఇంటర్ సెకండియర్ జనరల్ ఆర్ట్స్ కోర్సుల ఫీజు రూ.520, సెకండియర్ జనరల్ సైన్స్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) కోర్సుల ఫీజు రూ.750గా ఉంది.
సెకండియర్ ఒకేషనల్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) కోర్సుల ఫీజు రూ.750 చెల్లించాలి. వీటికి తోడు ఆలస్య రుసుం కూడా చెల్లించాల్సి ఉంటుంది.