ఆదర్శనగర్ పూరిళ్ళు బాధితులకు అండగా ఎంపీ బండి సంజయ్…
*అల్పాహారం.. భోజన సదుపాయం కల్పించిన ఎంపి….
కరీంనగర్ పట్టణంలోని ఆదర్శ నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురైన దాదాపు 30పూరి గుడిసెల బాధిత కుటుంబాల కు ఎంపీ బండి సంజయ్ కుమార్ అండగా నిలిచారు. అక్కడి నిరుపేద కుటుంబాల కోసం కరీంనగర్ బిజెపి శ్రేణుల ద్వారా అవసరమైన నిత్యావసర వస్తువులు, వంట పాత్రలను ఇతర సామాగ్రిని అందించారు. బాధితుల కోసం బుధవారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి బాధితులకు తగిన న్యాయం చేయాలని ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.