TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ చెరువులను కాపాడుకుందాం.
చెరువుల పరిరక్షణ కమిటీ.

మన ప్రాంత ప్రజల నీటి అవసరాలను తీర్చుకోవడానికి, భవిష్యత్తు తరాలు నీటి సమస్య లేకుండా జీవించాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులను కాపాడుకోవడం, పూడికతీత పనులను చెప్పటడం,ఇంకుడు గుంతలను విధిగా ఏర్పాటు చేసుకోవడం ముఖ్యమని వాటి ప్రాధాన్యతను ప్రజలు, ప్రభుత్వాలు గుర్తించే విధంగా కుత్బుల్లాపూర్ మండల చెరువుల పరిరక్షణ కమిటీ పనిచెయ్యాలని నేడు షాపూర్ నగర్లో జరిగిన సమావేశం సందర్భంగా కమిటీ నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో కమిటీ ఆధ్వర్యంలో నీటి ఆవశ్యకత పై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని,చెరువుల పరిరక్షణ కొరకు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం,ప్రజల సహకారంతో పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమలలో మేధావులు, యువకులు, ప్రజలు స్వచ్ఛందంగా కదలి రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు ఉమా మహేష్,రవీందర్ ముదిరాజ్, అశోక్ రెడ్డి, యాకయ్య, రాజు,హరినాథ్,ప్రవీణ్ లు హాజరయ్యారు.


TEJA NEWS