TEJA NEWS

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థిని భాజపా (BJP) ఖరారు చేసింది. వంశా తిలక్‌ను ఎంపిక చేస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. 2023లో జరిగిన ఎన్నికల్లో భారాస నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

మే 13న లోక్‌సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ స్థానానికి ఇప్పటికే భారాస, కాంగ్రెస్‌ తమ అభ్యర్థులను ప్రకటించాయి. లాస్య నందిత కుటుంబానికే భారాస టికెట్‌ కేటాయించింది. ఆమె సోదరి నివేదిత గులాబీ పార్టీ తరఫున బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీ నారాయణ శ్రీగణేశ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది…..


TEJA NEWS