TEJA NEWS

వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం సరికొండపాలెం తండా, సరికొండపాలెం, వడ్డెంగుంట మూగచింతలపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు *

మహిలాంమ్మ తల్లులు హరతులు పట్టి స్వాగతం పలకగా, నాయకులు, కార్యకర్తల సంభారాల్లో ప్రజలకు అభివాదం చేస్తూ శాసనసభ్యులు వారు ముందుకు సాగారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు హక్కు ను వినియోగించుకోవాలని మన బాధ్యత అని, సరైన పరిపాలన కోసం అభివృద్ధి చేస్తున్న జగనన్న కు మద్దత్తు తెలపాలంటే ఓటు వేసి మీ సహాయ సహాకారాలు అందించాలని కోరారు. ఈ ఐదేళ్లల పాలనలో నవరత్న పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందచేస్తూ, ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకు గా మారిన జగనన్న ను మరో మారు ముఖ్యమంత్రిని చేయాల్సిన భాద్యత మనందరిదని అన్నారు. వాలంటీయర్ ల వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తూ, చిన్నా, పెద్దా తారతమ్యాలను లేకుండా కుల, మత, పార్టీ లనే తేడాచూడకుండ అర్హులైనవారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న అన్నారు.


TEJA NEWS