కొమురం భీం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

కొమురం భీం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

TEJA NEWS

ఆసిఫాబాద్ జిల్లా :-
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమా దం చోటు చేసుకుం ది. రెండు బైకులు ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మర ణం చెందారు.

ఈ విషాదకర సంఘటన బెజ్జూరు మండలం పోతే పల్లి వద్ద చోటు చేసుకుంది. గుర్తించిన స్థానికులు పోలీ సులకు సమాచారమి చ్చారు.

సంఘటన స్థలానికి చేరు కున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు మహేష్, వెంగల్‌రావు, నర్సింహగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలిం చారు.

ఒకేసారి ముగ్గురు వ్యక్తులు మరణించడంతో తల్లిదండ్రు ల రోదనలు మిన్నంటాయి. కాగా, వేగంగా బైకులు నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

Print Friendly, PDF & Email

TEJA NEWS