అన్ని దానాల్లోను అన్నదానం గొప్పది
275 వ రోజు అన్నా క్యాంటీన్ కొనసాగింపు
(శ్రీకాకుళం)
అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని, అన్నార్తుల కోసమే అన్నాక్యాంటీను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తామని టిడిపి నియోజకవర్గ యువ నాయకులు,ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ ల సంఘ అధ్యక్షులు గొండు శంకర్ అన్నారు. టీడీపీ యువనాయకులు,ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల సంఘ అధ్యక్షులు గొండు శంకర్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నాక్యాంటీన్ శుక్రవారం 275వ రోజు కొనసాగించారు. అలాగే పాత బస్టాండ్ లో 275వ, రోజు కూడా అన్న క్యాంటీన్ ను నిర్వహించారు. అలాగే మొబైల్ వ్యాన్ల ద్వారా నగరంలో పల్చోట పేదలకు నిరాశ్రయులకు భోజనాలను అందజేశారు. ఈ సందర్బంగా శంకర్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం 2024 లో అధికారంలోకి వస్తుందన్నారు. 2024 లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మరలా అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తారని చెప్పారు. అన్న క్యాంటీన్ ల ద్వారా ప్రతిరోజు జిల్లాలో వేలాది మంది కడుపు నింపుకునే వారన్నారు. చంద్రబాబునాయుడు మరలా ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన పాలన అందిస్తారని, నేటి వైస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో పెరిగిన నిత్యావసరధరలతో పేదల, సామాన్యుల బతుకులు చిన్నాభిన్నమైనవని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 550 మంది అన్నార్తులు భోజనాలు చేశారు. ఈకార్యక్రమంలో మాజీ వార్డ్ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజ్యం ,రఫీ,చిడి బాలు,sv రమణ,మోహన్,నరసింహ, ఆనంద్,కిషోర్,ముత్యలమ్మ తదితరులు పాల్గొన్నారు.
275 వ రోజు అన్నా క్యాంటీన్ కొనసాగింపు
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…