TEJA NEWS

భోగవల్లి శ్రీధర్ కుటుంబానికి అండగా ఉంటాం

ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారం మరువలేనిది

బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్

భోగవల్లి శ్రీధర్ కుటుంబానికి అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ ,ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు .
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవల్లి శ్రీధర్ కు బీజేపీ నేతలు, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు నివాళులర్పించారు.
ఈనెల 17 న కన్నుమూసిన శ్రీధర్ సంతాప సభను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించగా బీజేపీ
రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ , మీడియా కోఆర్డినేటర్ పాతూరి నాగభూషణం,
ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, మువ్వల సుబ్బయ్య తదితరులు పాల్గొని శ్రీధర్ కు శ్రద్ధాంజలి ఘటించారు.

మధుకర్ జీ మాట్లాడుతూ పదవికి వన్నెతెచ్చిన వ్యక్తి భోగవల్లీ శ్రీధర్ అని కొనియాడారు.
అందరినీ చిరునవ్వుతో పలకరించే శ్రీధర్ మా మధ్య లేకపోవడం బాధాకరమన్నారు.
భారతీయ జనతా పార్టీ శ్రీధర్ కుటుంబానికి అండగా ఉంటుందన్నారు.
అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా చిత్తశుద్ధితో, అంకితభావంతో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి శ్రీధర్ అన్నారు.
విద్యార్థి దశ నుంచి ఏబీవీపీలో కీలక పాత్ర పోషించి అంచలంచెలుగా ఎదిగారని గుర్తు చేశారు.
ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు ఎమ్మెల్యే సుజనా చౌదరి అందించిన సహకారం మరువలేనిదన్నారు.
చివరి నిమిషం వరకు పార్టీ ఆశయాలు సిద్ధాంతాల కోసం పనిచేసిన
భోగవల్లీ శ్రీధర్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

ఈ సందర్భంగా శ్రీధర్ తో తముకున్న అనుబంధాన్ని బీజేపీ నేతలు గుర్తు చేసుకున్నారు.

కార్యక్రమంలో బీజేపీ నేతలు నూతలపాటి బాల, బబ్బూరు శ్రీరామ్, మాదల రమేష్, అవ్వారు బుల్లబ్బాయి , పోతిన భేసు కంటేశ్వరుడు , ఆర్ముగం, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, కోలపల్లి గణేష్, పీయూష్ దేశాయ్, పచ్చిపులుసు ప్రసాద్, పైలా సురేష్ ,బి ఎస్ కే పట్నాయక్, సోమేశ్వరరావు, కందుల సుబ్రహ్మణ్యేశ్వర రావు, దేవిన హరిప్రసాద్, దొడ్ల రాజా, పగడాల కృష్ణ, వై విశ్వేశ్వరరావు, ఎర్ర సునీత, బొమ్మదేవర రత్నకుమారి, కర్రీ నాగలక్ష్మి, షర్మిల, తదితరులు పాల్గొని సొకతప్త హృదయంతో శ్రీధర్ కు శ్రద్ధాంజలి ఘటించారు.