సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగారాలి, బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో గెలవాలి- ఎనుముల కృష్ణారెడ్డి & రఘునాథ్ యాదవ్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సీనియర్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు ఎనుముల కృష్ణా రెడ్డి హాజరయ్యారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్ రఘునాథ్ యాదవ్ హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈసారి కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో కచ్చితంగా గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ అని వారు చెప్పారు. నాయకులందరూ క్రమశిక్షణతో, ఐక్యంగా ఉండి అత్యధిక మెజారిటీ ఓట్లు రాబట్టాలని వారు చెప్పారు గద్దర్ అన్న కూతురు మాజీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నెల పాల్గొని తన పూర్తి మద్దతు తెలిపారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్నా కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ అసెంబ్లీ సీనియర్ నాయకులు భద్రి యాదవ్ , లక్ష్మణ్ గౌడ్ , ఖమ్మం ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్ డీవీ , ప్రసాద్ , ఇతర రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ స్థాయి సీనియర్ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.