TEJA NEWS

గ్రామ కార్యదర్శులకు,ప్రత్యేక అధికారులను ఆదేశించిన : ఎంపీపీ బిరబోలు రవీందర్ రెడ్డి.

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : ప్రస్తుతం ఎండ తీవ్రతలు అత్యధికంగా ఉన్న కారణంగా సూర్యాపేట మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల కార్యదర్శులు ప్రత్యేక అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూర్యాపేట మండలం ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి ఆదేశించారు.ప్రజల సంక్షేమం కోసం వెనువెంటనే ఈ చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప గృహాలలో నుండి బయటికి రావద్దని కోరారు. ఎండ దెబ్బ తగలకుండా సాధ్యమైనంత వరకు చల్లటి వాతావరణంలో గడపాలని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వచ్చేవారు తలకు టవల్ కట్టుకోవాలని అదేవిధంగా వీలుంటే గొడుగు తప్పనిసరిగా వాడాలని చల్లని నీటిని ఎప్పుడూ వెంట ఉంచుకోవాలని సూచించారు.శీతల పానీయాలు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలన్నారు


TEJA NEWS