రైతులను ఆగం చేసిన అకాల వర్షం
మెదక్ : నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు
పిడుగుపాటుతో ఇద్దరు రైతులు, గాలి దుమారానికి గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి
సంగారెడ్డి జిల్లా జోగిపేట, మెదక్ జిల్లా మాసాయిపేటలో మార్కెట్ యార్డు, కల్లాల వద్ద తడిచిన వరి ధాన్యం
భారీ వర్షం రావడంతో వరదలకు పలు చోట్ల కొట్టుకుపోయిన వైనం
చెల్లాచెదురైన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతుల కష్టాలు
సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో ఈదురు గాలులకు నేలరాలిన మామిడి, నెలకొరిగిన భారీ వృక్షాలు
గాలివానకి మెదక్ జిల్లా కౌడిపల్లి (మం) రాయిలపూర్ నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి
సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లిలో బావి వద్దకు వెళ్తుండగా పిడుగుపడి మల్లేశం(33) అనే రైతు మృతి
సంగారెడ్డి జిల్లా ఆందోల్ (మం) ఎర్రారం గ్రామ శివారులో పిడుగుపడి రైతు మృతి