TEJA NEWS

మల్కాజిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్పేట్ మండలంలోని షామీర్పేట్, పొన్నాల , బొమ్మరాజుపెట్, బాబాగూడ గ్రామలలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మల్కాజిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రాగిడి రజిని ..

ఈ ప్రచారంలో భాగంగా వారు ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు మన స్థానిక నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి కారు గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు..

కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయలేదని ప్రజలకు వివరిస్తూ, మోసం చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటూ, కాపాడుకుంటూ వచ్చిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అని తెలియచేశారు చేశారు..

బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిత్యవసర సరుకులు, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల బ్రతుకులపై గుది బండగా మారిందని, మత రాజకీయాలు చేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పా ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అని అన్నారు

ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, సీనియర్ నాయకులు వార్డ్ మెంబర్లు ఉద్యమకారులు మహిళా నాయకురాలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..


TEJA NEWS