ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయి ఇబ్రహీం రైసీ సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఆదివారం హెలికాప్టర్ కూలిపోయిందని, అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో సహా అందరూ మరణించారని ఇరాన్ మీడియా పేర్కొంది. ఇప్పుడు ఇబ్రహీం రైసీ మరణానంతరం ఇరాన్‌లో వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ మోఖ్బర్ అధికారాన్ని చేపట్టారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, అధ్యక్షుడు మరణిస్తే, ఉపాధ్యక్షుడు పదవిలో కొనసాగుతారు. గత రాత్రి ఇరాన్-అజర్‌బైజానీ సరిహద్దులో క్విజ్ ఖలాసి డ్యామ్ ప్రారంభోత్సవం అనంతరం ఇరాన్‌లోని తబ్రిజ్ నగరానికి వెళ్తుండగా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్-అబ్దుల్లాహియాన్ కూడా మరణించినట్లు సమాచారం. ఇబ్రహీం రైసీ మరణానంతరం ఇరాన్‌లో వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ మోఖ్బర్ పాలన సాగుతుందని మీడియా పేర్కొంది.
బాధ్యతలు చేపట్టిన ఇరాన్ కొత్త అధ్యక్షుడు
Related Posts
జైలులో అత్యధికంగా ఖైదీలున్న దేశం ఇదే!
TEJA NEWS జైలులో అత్యధికంగా ఖైదీలున్న దేశం ఇదే! ప్రపంచంలో అత్యధికంగా అమెరికా జైలులో 18,08,100 మంది ఖైదీలు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో చైనా (16,90,000), బ్రెజిల్ (8,50,377)ఉండగా ఫోర్త్ ప్లేస్ లో ఇండియా (5,73,220) ఉంది.ఆ తర్వాత రష్యా(4,33,006),…
సంచలన పరిణామం.. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. అరెస్ట్ వారెంట్ జారీ!
TEJA NEWS సంచలన పరిణామం.. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. అరెస్ట్ వారెంట్ జారీ! 2 బిలియన్ డాలర్ల లాభం పొందే కాంట్రాక్టులుదక్కించుకునేందుకు లంచానికి అంగీకరించినట్టు అభియోగాలు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు రూ.2,236) లంచం చెల్లింపునకు సిద్దమయ్యారని అభియోగాలు అరెస్ట్…