
తారస్థాయికి చేరిన అవినీతి..!
ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో బదిలీ వేటు..!
హర్షం వ్యక్తం చేస్తున్న పుర ప్రజలు
చిలకలూరిపేట:ప్రభుత్వ శాఖల్లోని కొందరు ఉన్నతస్థాయి నుంచి దిగువస్థాయి వరకు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. సామాన్యులు ప్రభుత్వ కార్యాలయాలకు ఏ పనుల కోసం వెళ్లినా కాసులే పరమావధిగా మారిన అధికారులు అవినీతి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. అయితే కొందరు అధికారులు, ఉద్యోగులు ఏసీబీ దాడుల్లో పట్టుబడుతుండగా మరికొందరు శాఖాపరమైన చర్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా చిలకలూరిపేట మున్సిపాలిటీ లో జరిగిన సంఘటన అందుకు ఉదాహరణగా నిలుస్తోంది.
చిలకలూరిపేట పురపాలకసంఘం టౌన్‌ప్లానింగ్‌లో పని చేస్తున్న అధికారిణి (టీపీఎస్)అవినీతి తారస్థాయికి చేరింది. విధుల్లో చేరినప్పటి నుంచి చేతివాటం అలవాటుగా మార్చుకున్న ఆమె పై ప్రమోషన్ ఇస్తూ చిలకలూరిపేటలోనే కొనసాగిస్తూ ఆర్డర్స్ ప్రభుత్వం జారీ, వెంటనే అది క్యాన్సిల్ చేస్తూ మళ్లీ రేపల్లె బదిలీ వేటు పడింది. వివరాల్లోకి వెళితే…
2014 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేట బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న క్రమంలో చిలకలూరిపేటలోనే టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గా ప్రమోషన్ పొందింది పని చేసిన ఆమె తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇక్కడ టీపీఎస్ గా విధుల్లో చేరారు. గతంలో ఇక్కడ పని చేసిన అనుభవం, స్థానికంగా పరిచయాలు ఉన్న ఆమెకు అవినీతి లావా దేవీల వ్యవహారాలన్నీ సుపరిచితమే. పట్టణం గురించి బాగా తెలిసిన అధికారిని పట్టణాభివృద్ధికి దోహదపడుతారని ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ భావించారు. కానీ ఆమె మాత్రం పట్టణాభి వృద్ధి పై కాకుండా అందిన కాడికి దండుకోవాదంపైనే దృష్టి సరించారని విమర్శలు వ్యాపించాయి. భవనాల అనుమతుల దగ్గరనుంచి అనధికార లేఔట్ల వరకు ప్రణాళిక విభాగంకు సంబంధించిన ప్రతి పని ఫైల్ కదలాలంటే పైసలు ముట్టజెప్పాల్సిందే. లేకుంటే ఫైల్ ముందుకు కదలదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవొద్దని.. కార్యాలయాలకు వచ్చే ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలను కూడా ఆమె పెదచేవిన పెట్టారు. ఎట్టకేలకు ఈమె వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఆమెను ఇక్కడ నుంచి బదిలీ చేయడంతో పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతికి అడ్డుకట్ట పడినట్టయ్యింది. దీంతో పలువురు పుర ప్రముఖులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
